Bhuvi Yorker : భువి దెబ్బకు రాజస్థాన్ అబ్బా..
ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ కు సన్ రైజర్స్ భారీ షాకిచ్చింది.

Bhuvi hit Rajasthan Abba..
ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ కు సన్ రైజర్స్ భారీ షాకిచ్చింది. ఉప్పల్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. అద్భుతమైన బౌలింగ్ తో భువనేశ్వర్ కుమార్ అదరగొట్టేసాడు. చివరి బంతికి విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. భువీ యార్కర్ (Bhuvi Yorker) ను ఆడలేకపోయిన పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో సన్ రైజర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ లో భువనేశ్వర్ 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (Man of the match) అవార్డ్ ను దక్కించుకున్నాడు. అయితే 7 ఏళ్ల తర్వాత అతడు అందుకున్న తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇదే. ఈ అవార్డు కు ముందు 7 సంవత్సరాలుగా ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకోలేదు. ఇప్పుడు అద్భుత బౌలింగ్ తో జట్టును గెలిపించిన భువికి సన్ రైజర్స్ ఫాన్స్ విషెస్ చెబుతున్నారు.