DELHI CAPITALS: ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్‌షాక్.. సీజన్ నుంచి 4 కోట్ల ప్లేయర్ ఔట్
గతేడాది సీజన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2023 వేలంలో అతడిని సన్‌రైజర్స్ ఏకంగా 13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అయితే బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు.
DELHI CAPITALS: ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024 తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీకి బ్రూక్ తెలియజేశాడు. గతేడాది సీజన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2023 వేలంలో అతడిని సన్‌రైజర్స్ ఏకంగా 13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది.
MLC KAVITHA: కవిత సింపథీ గేమ్ మొదలుపెట్టారా.. లిక్కర్ కేసులో సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?
అయితే బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఐపీఎల్ 2024కు ముందు ఆరెంజ్ ఆర్మీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన హ్యారీని రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే హ్యారీ బ్రూక్ సామర్థ్యంపై నమ్మకం ఉంచి ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంది. ఇప్పుడు బ్రూక్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా యువ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను జట్టులోకి తీసుకుంది. 21 ఏళ్ల ఫ్రేజర్ విధ్వంసక బ్యాటర్. భారీ షాట్లను సునాయాసంగా ఆడగలడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అంతేగాక 29 బంతుల్లో సెంచరీ బాది వైట్ బాల్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సాధించాడు.
మార్ష్ కప్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన ఫ్రేజర్ తస్మనియా జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఫ్రేజర్ తీసుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధానకోచ్ రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారిందని పాంటింగ్ చెప్పాడు. కాగా ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి మొదలు కానుంది.