UP T20 : యూపీ టీ20 లీగ్ లో భువికి భారీ ధర.. భారీ మొత్తానికి కొన్న లక్నో
టీమిండియా (Team India) సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Team India) ను అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) లో చూసి చాలా రోజులైపోయింది.

Big price for Bhuvi in UP T20 League.. Lucknow bought for a huge amount
టీమిండియా (Team India) సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Team India) ను అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) లో చూసి చాలా రోజులైపోయింది. ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువైన నేపథ్యంలో భువికి సెలక్టర్లు మళ్ళీ పిలుపునివ్వడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే రీఎంట్రీకి కోసం శ్రమిస్తున్న భువనేశ్వర్ కుమార్ దేశవాళీ క్రికెట్ (Cricket) లో మాత్రం రాణిస్తున్నాడు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ లో భువి రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. యూపీ టీ20 (UP T20) లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రూ. 30.25 లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువీ రికార్డులకెక్కాడు. ఈ వెటరన్ పేసర్ తొలి ఎడిషన్‌లో నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.
గత సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీయడంతో అతని కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీపడ్డాయి. కాన్పూర్ సూపర్ స్టార్స్ (Kanpur Super Stars), గోరఖ్‌పూర్ లయన్స్ పర్స్ (Gorakhpur Lions Purse) లో తగినంత మొత్తం లేకపోవడంతో చివరికి లక్నో ఫాల్కన్స్ అతన్ని దక్కించుకుంది. ఐపీఎల్ (IPL) లో భువి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా యూపీ టీ20 లీగ్ రెండో సీజన్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో నితీష్ రాణా, శివమ్ మావి, వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి క్రికెటర్లు ఆడనున్నారు.