Chennai Super Kings : చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్..
ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ (Champion) చెన్నై సూపర్ కింగ్స్‌కు (Chennai Super Kings) బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశా పతిరణ గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Big shock for Chennai Super Kings..
ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ (Champion) చెన్నై సూపర్ కింగ్స్‌కు (Chennai Super Kings) బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశా పతిరణ గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని సీఎస్‌కే వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన టీ20 (T20) సిరీస్‌లో మతీశా పతిరణ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతని తొడ కండరాల గాయం నయమవ్వడానికి నాలుగైదు వారాల సమయం పట్టనుందని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరం కానున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో పతిరణ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు