ఇశాంత్ శర్మకు బిగ్ షాక్, మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న జీటీ పేసర్ ఇషాంత్ శర్మకు మరో ఎదురు దెబ్బ తగిలింది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న జీటీ పేసర్ ఇషాంత్ శర్మకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఇషాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది .
ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. స్తుల్ని కానీ, గ్రౌండ్ ఈక్విప్మెంట్ పట్ల కానీ అమర్యాదరకంగా ప్రవర్తిస్తే ఐపీఎల్ ప్రవర్తనా నియామావళిలోని 2.2 ప్రకారం లెవల్ 1 కింద ఫైన్ విధిస్తారు. లెవల్ 1 నేరాన్ని ఇషాంత్ శర్మ అంగీకరించడంతో.. మ్యాచ్ రెఫరీ నిర్ణయం ప్రకారం జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది.