ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్, 2 వారాల తర్వాతే బుమ్రా ఎంట్రీ
ఐపీఎల్ 18వ సీజన్ లో రెండు వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకొని ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్‌కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 18వ సీజన్ లో రెండు వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకొని ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్‌కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.అయితే అతను ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నాడని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. బుమ్రా ప్రాక్టీస్‌ను బీసీసీఐ మెడికల్ టీమ్ దగ్గరుండి పర్యవేక్షిస్తుందని తెలిపాయి. బుమ్రా పూర్తిగా కోలుకునేందుకు మరో 2 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.