రాయుడుకు బిగ్ షాక్ ? కామెంట్రీ ప్యానల్ నుంచి ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడుకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఐపీఎల్ కామెంట్రీ ప్యానల్ నుంచి అతన్ని తొలగించే అవకాశాలున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడుకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఐపీఎల్ కామెంట్రీ ప్యానల్ నుంచి అతన్ని తొలగించే అవకాశాలున్నాయి.ఐపీఎల్ 2025 సీజన్ కామెంట్రీ, విశ్లేషణ సమయాలలో ఒక జట్టును కించపరిచేలా అదే సమయంలో మరో జట్టును పొగుడుతూ అంబటి రాయుడు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు.
దీంతో ఐపీఎల్ యాజ మాన్యం చాలా సీరియస్ గా ఉందని సమాచారం. అందుకే అతన్ని ఇకపై కామెంట్రీ చేయకుండా… నోటీసులు ఇచ్చే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సోషల్ మీడియా అలాగే జాతీయ మీడియాలలో కథనాలు వస్తున్నాయి.