IPL 2023: చెంపదెబ్బ నుంచి బూటు కాలు వరకు..! అందుకే ఐపీఎల్‌ అంటేనే కిక్కు..

లలిత్‌ మోదీ మైండ్‌లో ఐపీఎల్ ఐడియా ఏ ముహూర్తాన తట్టిందో కానీ.. ఈ లీగ్‌ పంచే మజా అంతా ఇంతా కాదు.. మైమరిపించే మ్యాచ్‌లే కాదు.. అభిమానులకు కిక్కిచ్చే కాంట్రవర్సీలకు కూడా లెక్కే లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2023 | 09:00 PMLast Updated on: May 02, 2023 | 9:00 PM

Biggest Controversies In Ipl Sreesanth Vs Harbhajan Singh Gambhir Vs Kohli Starc Vs Pollard Umpires Vs Dhoni Gambhir Vs Kohli

సమ్మర్ ఎప్పుడొస్తుందా అని వెయిట్‌ చేసే వారి సంఖ్య ఇండియాలో కోట్లలో ఉంటుంది. 2008ముందు వరకు ఆ సంఖ్య లక్షల్లో మాత్రమే ఉండేది.. ఎందుకంటే కేవలం స్కూల్ పిల్లలు మాత్రమే హాలీడేస్‌ వస్తాయని సమ్మర్‌ కోసం ఎదురుచూసేవాళ్లు.. కానీ ఐపీఎల్‌ ఎంట్రీతో యావత్ దేశం మైండ్‌సెట్ మారిపోయింది.. 2008నుంచి ఇప్పటివరకు సమ్మర్‌లో అన్నిటికంటే ప్రజలు ఎంటర్‌టైన్‌ చేసింది కేవలం ఐపీఎల్‌ మాత్రమే.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టీవీలకు అతుక్కుపోయేలా చేసిందీ లీగ్‌..ఎంత ఘనంగా ప్రారంభమైందో.. అదే రేంజ్‌లో ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విన్యాసాలే కాదు.. కాంట్రవర్సీలతోనూ అభిమానులకు కిక్కిచ్చే లీగ్ ఐపీఎల్‌. తాజాగా లక్నో వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌లో కోహ్లీ వర్సెస్‌ గంభీర్ గొడవ టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారిపోయింది.. ఈ గొడవ తర్వాత గతంలో ఐపీఎల్‌లో జరిగిన పాత కాంట్రవర్సీలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

శ్రీశాంత్‌ వర్సెస్ హర్భజన్ సింగ్, 2008:

ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని ఘటన తొలి సీజన్‌లోనే జరిగింది. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా సహనం కోల్పోయిన హర్భజన్ సింగ్.. శ్రీశాంత్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత హర్భజన్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పినప్పటికీ తీవ్ర నేరంగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు సీరియస్‌ ఆ సీజన్ ఆడకుండా భజ్జీపై నిషేధం విధించారు.

షారుక్ ఖాన్ వర్సెస్‌ వాంఖడే స్టాఫ్‌,2012:

ఐపీఎల్ 2012 సీజన్‌లో కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురయ్యాడు. గ్రౌండ్స్‌మెన్‌పై దాడి చేసినందుకు ఆయనపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2015లో ఎత్తివేశారు.

స్పాట్ ఫిక్సింగ్, 2013:

ఐపీఎల్‌ స్ఫాట్ ఫిక్సింగ్ కేసు శ్రీశాంత్ క్రికెట్ కెరీర్‌ని నాశనం చేసింది. కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించిన శ్రీశాంత్.. తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు కానీ.. అతని కెరీర్‌ మాత్రం అప్పటితనే ఎండ్ ఐపోయింది.. 2013లో శ్రీశాంత్‌ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు.. అప్పట్లో ఈ ఘటన పెను దుమారాన్నే రేపింది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారడంతో బీసీసీఐ శ్రీశాంత్‌పై శాశ్వతంగా నిషేధం విధించగా అతడు వివిధ కోర్టుల్లో పోరాడి విజయం సాధించాడు.

గంభీర్‌ వర్సెస్ కోహ్లీ, 2013:

2013లో గంభీర్‌, కోహ్లీ గ్రౌండ్‌లోనే తన్నుకునే వ
రకు వెళ్లారు.. కోహ్లీ అవుటైన తర్వాత గంభీర్‌ సెలబ్రెట్ చేసుకుంటుండగా విరాట్ ఏదో అన్నాడు.. వెంటనే కోపం తెచ్చుకున్న కోహ్లీ గంభీర్‌పైకి దూసుకెళ్లాడు.. అటు గంభీర్‌ సైతం కోహ్లీని కొట్టే రేంజ్‌లో అడుగులు వేశాడు. సహచర ఆటగాడు రజత్‌ భటియా ఇద్దరి మధ్య అడ్డుగొడలా నిలబడడంతో ఆ గొడవ అక్కడే ఆగిపోయింది..

పొలార్డ్‌ వర్సెస్ స్టార్క్‌, 2014:

2014లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడింది. ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్, ఆర్‌సీబీ బౌలర్ మిచెల్ స్టార్క్ గ్రౌండ్‌లో గొడవ దృశ్యాలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో తిరుగుతూనే ఉన్నాయి. స్టార్క్‌పై కోపంతో కీరన్ పొలార్డ్ బ్యాట్‌ను విసిరాడు. ఆ తర్వాత కోహ్లీ వచ్చి పొలార్డ్‌తో వాగ్వాదానికి దిగాడు..

చెన్నై, రాజస్థాన్ బ్యాన్‌:

ఐపీఎల్‌లో బ్యాన్ అనే పదం వినపడితే వెంటనే గుర్తొచ్చే పేర్లు రాజస్థాన్, చెన్నై. ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి 2016, 2017లలో ఈ రెండు జట్లను బ్యాన్‌ చేశారు. రెండేళ్లపాటు టోర్నీ నుంచి నిషేధించారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చెన్నై.. సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చి కప్ కొట్టింది.

ధోనీ వర్సెస్ అంపైర్లు, 2019:

భారత క్రికెట్‌లో తన బలమేమిటో ధోనీ చూపించిన సీజన్‌ ఇది. అంటే నెగిటివ్‌గా.. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను ఆ రోజు అలా చేయగలిగాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ధోని డగౌట్ నుంచి మిడిల్ గ్రౌండ్‌కి వచ్చి మరి అంపైర్లతో గొడవ పడ్డాడు. నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయంపై డగౌట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ధోనీ ఏకంగా ఫీల్డ్‌లోకి వచ్చేశాడు. అసలు అంపైర్లతో గొడవ పడటానికి బయట కూర్చున్న వ్యక్తి గ్రౌండ్‌లోకి రావడం హిస్టరీలో అదే తొలిసారి.

Kohili vs Gambhir

Kohili vs Gambhir

గంభీర్ వర్సెస్ కోహ్లీ, 2023:

గతంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయినప్పుడు లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ నోటికి తాళాలు వేసుకోవాలని బెంగళూరు క్రౌడ్‌కి సైగలు చేయడాన్ని విరాట్ మదిలో పెట్టుకున్నట్లు క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. అందుకే తాజాగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ పగ తీర్చుకునే ప్రయత్నం చేశాడు.. ఇదే గంభీర్‌కు కోపం తెప్పించింది.. దీంతో మరోసారి ఇద్దరు గ్రౌండ్‌లో కొట్టుకునే వరకు వెళ్లారు.. సహచర ఆటగాళ్లు ఆపకపోతే అదే చేసేవాళ్లు కూడా.