Virat Kohli: రామ్ చరణ్ హీరోగా వెండితెరపైకి విరాట్ కోహ్లీ జీవితం

టీమ్ భారత్ మాజీ సారథి బయోపిక్ తీసేందుకు రెడీ అయిందని తెలుస్తున్నది. అదీగాక కోహ్లీ పాత్రలో నటించేది ఎవరో కాదు.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అని టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 05:33 PMLast Updated on: Sep 06, 2023 | 5:33 PM

Bollywood Making Virat Kohlis Biopic With Ram Charan

Virat Kohli: భారత క్రికెట్ దైవం సచిన్ టెండూల్కర్ తర్వాత అంత స్థాయిలో ఆటను, అభిమానులను సాధించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రోకు సంబంధించి ఏ విషయం వచ్చినా అది క్షణాల్లో వైరల్ కావాల్సిందే. కోహ్లీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. తాజా సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ బయోపిక్ చర్చ మరోసారి మొదలైంది. బాలీవుడ్‌లో బడా సినిమాలు తీసే ఓ భారీ నిర్మాణ సంస్థ.. టీమ్ భారత్ మాజీ సారథి బయోపిక్ తీసేందుకు రెడీ అయిందని తెలుస్తున్నది.

అదీగాక కోహ్లీ పాత్రలో నటించేది ఎవరో కాదు.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అని టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. క్లీన్ టోన్డ్ బాడీతో ఉండే కోహ్లీ పాత్ర కోసం బాలీవుడ్‌లో కొంతమంది హీరోలను సంప్రదించి విఫలమైన సదరు నిర్మాతలు.. ఇంచుమించు అదే దేహధారుడ్యంతో ఉండే చరణ్ అయితే విరాట్ పాత్రకు న్యాయం చేస్తారని భావిస్తున్నారట. ఆటగాడిగా కోహ్లీలోని దూకుడు, అగ్రెసివ్ అటిట్యూడ్‌తో పాటు ఇతరుల పట్ల వినయంగా ఉండటం వంటివి చరణ్‌లోనూ ఉన్నాయి. ఇద్దరూ ఎంచుకున్న రంగాలు వేరు అయినా ఆ భావాలను స్క్రీన్‌పై పండించడంలో చిరు తనయుడు అభిమానులను మెప్పిస్తాడని నిర్మాతలు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కోహ్లీ బయోపిక్‌కు సంబంధించి వాళ్లు అనుకుంటున్న విధంగా తనను తాను ఛేంజ్ చేసుకోవడానికి చరణ్ కూడా సిద్ధంగా ఉండటంతో ఈ చిత్రాన్ని వీలున్నంత త్వరగా మొదలుపెట్టనున్నారని తెలుస్తున్నది.