Team India: జూనియర్ లక్ష్మణ్.. జూనియర్ గంబీర్.. టెస్ట్ క్రికెట్ గత వైభవం చూడబోతున్నాం
ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తమతమ ఫ్రాంచైజీలకు వొంటి చేత్తో విజయాలను అందించిన ఈ ఫ్యూచర్ స్టార్స్, ఇప్పుడు టీమిండియాలో చేరి, ఎన్నో మైలురాళ్లను అందుకోనున్నారు.

Both Ruthuraj Gaikwad and Yashaswi Jaiswal are being hailed as Junior Laxman and Junior Gambhir by sports fans.
ఐసిసి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమితో టీమిండియా సర్వత్రా నెగటివిటీని చవిచూసింది. ఈ నేపథ్యంలో రానున్న విండీస్ టూర్ కోసం కొందరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఈ ఇద్దరు చిచ్చరపిడులకు అవకాశం ఇచ్చే ప్లాన్ లో ఉందట బీ సి సి ఐ. చాలా రోజులుగా టీమిండియాకు సరైన టెస్టు ఓపెనర్ లేకుండా పోయాడు. శిఖర్ ధావన్ ఉన్నప్పుడు అన్ని ఫార్మాట్లలో ఓపెనింగ్ కి దిగి అదరగొట్టేవాడు, ఆ తరవాత అంతటి ఆటగాడిని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది భారత క్రికెట్.
దూకుడుతో పాటు, చక్కని క్రికెట్ ఆటతో మెప్పించగల ఈ ఇద్దరు సెన్షేషన్ ప్లేయర్స్ ని సలెక్ట్ చేయడం చూసి, టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులైతే, ఈ ఇరువురినీ జూనియర్ లక్ష్మణ్, జూనియర్ గంభీర్ లుగా ఆకాశానికేతెస్తున్నారు. ఐ పి ఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా దుమ్ముదులిపిన ఈ ఆటగాళ్లను సరిగ్గా సానపెడితే, మరో ఆరేడేళ్ల పాటు, టెస్టు ఫార్మాట్ ఓపెనింగ్ కోసం వెతికే పనుండదు. ఇక విండీస్ టూర్ షెడ్యూల్ విషయానికొస్తే జులై 12-16 మధ్య తొలి టెస్టు, 20-24 నుంచి రెండో టెస్టు జరుగనుండగా జులై 27 నుంచి ఆగస్టు 1 వరకూ మూడు వన్డేలు జరుగుతాయి.