Pushups: గంటలో 3,206 పుషప్స్‌.. ఇదేం ఫిట్‌నెస్‌ గురూ!

లండన్‌కు చెందిన లుకాస్‌ అనే వ్యక్తి ఏకంగా 3 వేలకు పైగా పుషప్స్‌ కంటిన్యూగా చేసి వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. అది కూడా ఒక రోజులో కాదు. జస్ట్‌ ఒక గంటలో. 60 నిమిషాల్లో 3,206 పుషప్స్‌ చేసి గిన్నిస్‌ బుక్‌లో ప్లేస్‌ కొట్టేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2023 | 03:09 PMLast Updated on: Apr 14, 2023 | 3:09 PM

Brisbane Man Breaks Guinness World Record With 3206 Pushups In One Hour

Pushups: ఆర్మ్స్‌, చెస్ట్‌ను స్ట్రాంగ్‌గా చేయడంలో పుషప్స్‌ చాలా కీలకం. కానీ ఆ ఎక్సర్‌సైజ్‌ చేయడం అంత ఈజీ కాదు. కంటిన్యూగా వంద పుషప్స్‌ చేయడం కూడా ఇంపాజిబుల్‌. జిమ్‌ చేసేవాళ్లు తప్ప నార్మల్‌ పర్సన్స్‌ చేయలేరు. గట్టిగా 10 పుషప్స్‌ చేయగానే గుండె నోట్లోకి వచ్చిన ఫీలింగ్‌ వస్తుంది.

కానీ.. లండన్‌కు చెందిన లుకాస్‌ అనే వ్యక్తి మాత్రం ఏకంగా 3 వేలకు పైగా పుషప్స్‌ కంటిన్యూగా చేసి వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. అది కూడా ఒక రోజులో కాదు. జస్ట్‌ ఒక గంటలో. 60 నిమిషాల్లో 3,206 పుషప్స్‌ చేసి గిన్నిస్‌ బుక్‌లో ప్లేస్‌ కొట్టేశాడు. 33 ఏళ్ల లుకాస్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. రెగ్యులర్‌గా జిమ్‌ చేస్తుంటాడు. తనను తాను ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచుకుంటాడు. అతని డైలీ రొటీన్లో ఏది మిస్‌ అయినా ఎక్సర్‌సైజ్‌ మాత్రం మిస్‌ అవ్వదు. ఇలాంటి ఫిట్‌నెస్‌తో ఒక నిమిషంలో యావరేజ్‌గా 53 పుషప్స్‌ చేశాడు లుకాస్‌. ఇలా 60 నిమిషాల్లో ఈజీగా 3 వేలకు పైగా పుషప్స్‌ కంప్లీట్‌ చేశాడు. 2022లో డేనియల్‌ అనే వ్యక్తి పుషప్స్‌లో వరల్డ్‌లో నెంబర్‌ వన్‌గా ఉండేవాడు.

గంటలో యావరేజ్‌గా 3,182 పుషప్స్‌ చేసి వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు డేనియల్ రికార్డ్‌ను లుకాస్‌ బద్దలు కొట్టాడు. డేనియల్‌ కంటే 24 పుషప్స్‌ ఎక్కువగా చేసి కొత్త రికార్డ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నుంచి ప్రతీ ఇయర్‌ తన రికార్డ్‌ను తానే బ్రేక్‌ చేస్తాను అంటున్నాడు లుకాస్‌. ప్రస్తుతం ఇతని రికార్డ్‌ ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతోంది. 33 ఏళ్ల వయసులో ఇలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేయడం నిజంగా చాలా గ్రేట్‌ అంటున్నారు నెటిజన్లు. లుకాస్‌ ఫిట్‌నెస్‌ లెవెల్స్‌కు వాళ్లు ఫిదా అవుతున్నారు.