రోహిత్ కంటే బుమ్రా రన్స్ ఎక్కువ, ఆసీస్ గడ్డపై మెరిసింది వీరే
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లందరూ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే దీనికి ప్రధాన కారణం. రోహిత్ , కోహ్లీ, రాహుల్, గిల్ , పంత్ ఇలా ఒక్కరు కూడా రాణించలేదు.
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లందరూ అట్టర్ ఫ్లాప్ అవ్వడమే దీనికి ప్రధాన కారణం. రోహిత్ , కోహ్లీ, రాహుల్, గిల్ , పంత్ ఇలా ఒక్కరు కూడా రాణించలేదు. అడపా దడపా రాణించినా ఆసీస్ విజయాన్ని అవి ఆపలేకపోయాయి. అదే సమయంలో కొందరు యువ ఆటగాళ్ళు మాత్రం ఆకట్టుకున్నారు. యంగ్‌స్టర్స్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటారు. ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో భారత్ నుంచి యశస్వి జైశ్వాల్ టాప్ లో ఉన్నాడు. పది ఇన్నింగ్స్‌లలో కలిపి 43. 44 యావరేజ్‌తో 391 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్ లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా జైస్వాల్ ఉన్నాడు. 448 పరుగలతో ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు.
ఇదిలా ఉంటే ఆసీస్ సిరీస్ తోనే టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి కూడా అదరగొట్టాడు. 298 పరుగులతో టీమిండియా తరఫున సెకండ్ ప్లేస్ లోనూ, 276 రన్స్ తో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచారు.ఇక రిషబ్ పంత్ 255 రన్స్ తో నాలుగో స్థానంలో నిలిస్తే… అంచనాలను అందుకోలేకపోయిన విరాట్ కోహ్లి 190 రన్స్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. కాగా ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అతడి కంటే బుమ్రా ఎక్కువ పరుగులు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుమ్రా 42, ఆకాశ్ దీప్ 38 రన్స్ తో రోహిత్ కంటే ఎక్కువ పరుగులు చేశారు.
ఇదిలా ఉంటే బౌలింగ్ లో మాత్రం భారత్ దే పైచేయిగా నిలిచింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో హయ్యెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐదు మ్యాచుల్లో కలిసి బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాత సిరాజ్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఐదో టెస్ట్‌లో స్థానం దక్కించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఆరు వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో ఆకాష్ దీప్, నితీష్ కుమార్ ఉన్నారు.