బుమ్రా ట్రిపుల్ సెంచరీ స్టార్ పేసర్ నయా హిస్టరీ
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా టీ20ల్లో 300 వికెట్లు తీసిన భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు.

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా టీ20ల్లో 300 వికెట్లు తీసిన భారత పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ అతితక్కవ ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. హాఫ్ సెంచరీతో రాణించిన హెన్రిచ్ క్లాసెన్‌ను పెవిలియన్ పంపించాడు. దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని బుమ్రా.. కేవలం 237 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు.
మొత్తంగా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 208 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. రెండో ప్లేసులో శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ నిలిచాడు. మలింగ.. 217 ఇన్నింగ్స్‌లలో 300 టీ20 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.భారత్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో పేసర్ బుమ్రానే. అంతకుముందు భువనేశ్వర్ కుమార్.. టీ20లలో 300 వికెట్లు పడగొట్టాడు. గతేడాది జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఈ మ్యాచ్ ద్వారా బుమ్రా మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లసిత్ మలింగ సమం చేసాడు. మలింగ 122 మ్యాచ్‌లలో 170 ఐపీఎల్ వికెట్లు తీశాడు. బుమ్రా 138 మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మలింగ, బమ్రా తర్వాత హర్భజన్ సింగ్ ఉన్నాడు. భజ్జీ ముంబై ఇండియన్స్ తరఫున 127 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానాల్లో మిచెల్ మెక్లెనెగన్, కీరన్ పొలార్డ్‌లు ఉన్నారు.