World Cup : రషీద్ ఇకపై ఆడలేడా?
వన్ డే ప్రపంచకప్ లో ఎన్నో సంచనాలు నమోదు చేసిన ఆఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్ పాత్ర అమోఘం అని చెప్పుకోవాలి. స్టార్ జట్లకు ఝలక్ ఇస్తూ, ఆఫ్ఘన్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు.
వన్ డే ప్రపంచకప్ లో ఎన్నో సంచనాలు నమోదు చేసిన ఆఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్ పాత్ర అమోఘం అని చెప్పుకోవాలి. స్టార్ జట్లకు ఝలక్ ఇస్తూ, ఆఫ్ఘన్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. భారత్ మీద కూడా తమ బ్యాటింగ్ సత్తా రాణించి శబాష్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్నెముకకు గురువారం సర్జరీ చేయించుకున్నాడు. దీంతో డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే బిగ్‌బాష్ లీగ్‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. సర్జరీ సక్సెస్ అయ్యిందని రషీద్ పేర్కొన్నాడు. ఈ టైమ్‌లో అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. వీలైనంత త్వరగా గ్రౌండ్లోకి వచ్చేందుకు ట్రై చేస్తానని చెప్పాడు. మరో వారం రోజుల్లో రిహాబిలిటేషన్ మొదలుపెట్టనున్న రషీద్.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఇండియా, అఫ్గానిస్తాన్ సిరీస్‌కు అందుబాటులో ఉండే చాన్స్ ఉంది. మరోవైపు బిగ్‌బాష్ లీగ్ కోసం రషీద్ ప్లేస్‌లో హ్యారీ బ్రూక్ ను టీమ్‌లోకి తీసుకున్నట్లు అడిలైడ్ స్ట్రయికర్స్ వెల్లడించింది.