Rohit Sharma, Hit Man : హిట్ మ్యాన్ రికార్డుల మోత..

శ్రీలంక (Sri Lanka) తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 33 బంతుల్లో ఫిప్టీ సాధించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 3, 2024 | 05:50 PMLast Updated on: Aug 03, 2024 | 5:50 PM

Captain Rohit Sharma Scored A Brilliant Half Century In The First Odi Against Sri Lanka

శ్రీలంక (Sri Lanka) తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 33 బంతుల్లో ఫిప్టీ సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket) లో అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్రకెక్కాడు. రోహిత్ (Rohit) సారథిగా 134 ఇన్నింగ్స్ లలోనే 234 సిక్సర్లు బాదాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricketer) లో వేగంగా 15వేల పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. సచిన్ 331 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించగా, హిట్ మ్యాన్ 352 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. ఇక వన్డేల్లో పది ఓవర్లలోపే అత్యధిక అర్ధశతకాలు బాదిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, టాప్ ప్లేస్ లో ఉండగా.. రోహిత్, సచిన్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.