హై హై నాయకా కెప్టెన్సీలో రోహిత్ రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో మహ్మద్ షమీ, బ్యాటింగ్ లో శుభమన్ గిల్ అదరగొట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 03:30 PMLast Updated on: Feb 22, 2025 | 3:30 PM

Captain Rohit Sharma Was Brilliant And Took The Record To His Account

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో మహ్మద్ షమీ, బ్యాటింగ్ లో శుభమన్ గిల్ అదరగొట్టారు. దీంతో బంగ్లా ఉంచిన 229 పరుగుల టార్గెట్ ను టీమిండియా 46.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమై రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ పై టీమిండియా విజయంతో భారత జట్టు కెప్టెన్ గా 100 మ్యాచ్ లను గెలిచాడు. ఇప్పటివరకు నలుగురు కెప్టెన్లు మాత్రమే టీమిండియా తరఫున 100 కంటే ఎక్కువ మ్యాచ్ లను గెలిచారు. మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ గతంలో కెప్టెన్లుగా భారత జట్టును 100 విజయాలకు నడిపించారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ వారి కంటే మెరుగైన సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మ సక్సెస్ రేటు ప్రస్తుతం 72. అజారుద్దీన్ సక్సెస్ రేటు 47.05 శాతం, ధోనీ సక్సెస్ రేటు 53.61%, విరాట్ కోహ్లీ విజయ శాతం 63.38%. రోహిత్ శర్మ సక్సెస్ రేటు వారి కంటే చాలా మెరుగ్గా ఉంది.

దీనితో పాటు ప్రపంచ స్థాయిలో అత్యంత వేగంగా 100 విజయాలు సాధించిన కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. రోహిత్ రికీ పాంటింగ్ తో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో 138 మ్యాచ్‌ల్లో 100 మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. కెప్టెన్‌గా రోహిత్‌ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్‌ల్లో వచ్చాయి. కెప్టెన్‌గా రోహిత్‌ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు ముందు రికీ పాంటింగ్‌ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్‌ పర్సంటేజీతో విజయాలు సాధించాడు.

ఇదిలా ఉంటే రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. 30 ఏళ్ల తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలిచిన తొలి కెప్టెన్‌గా కూడా ఘనత సాధించాడు. రికీ పాంటింగ్ 28 సంవత్సరాల వయస్సు నుంచి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, రోహిత్ శర్మ 30 ఏళ్ల తర్వాతే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి 100 విజయాలు సాధించాడు. కాగా
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్‌లో ఆసీస్‌కు 324 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. పాంటింగ్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం​ఎస్‌ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌ వ్యవహరించి 178 ​మ్యాచ్‌ల్లో గెలిపించాడు.