యూఎస్ ఓపెన్ లో సంచలనం రెండో రౌండ్ లోనే అల్కరాజ్ ఔట్
ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ , ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు.
ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ , ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ ప్లేయర్, 74వ ర్యాంకర్ అయిన బొటిక్ వాన్‌డి చేతిలో 1-6, 5-7, 4-6 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. 2021 వింబుల్డన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రీక్వార్టర్స్ లోపే నిష్క్రమించడం అల్కరాజ్‌కు ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లలో టైటిల్స్ గెలిచాడు. యూఎస్ ఓపెన్‌లోనూ గెలిచి.. ఓ సీజన్‌లో ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలిచిన మూడో ప్లేయర్‌గా రికార్డు సాధించాలనుకున్న అతని ఆశలకు బొటిక్ బ్రేకులు వేశాడు.