ఔను వాళ్ళిద్దరూ విడిపోయారు చాహల్,ధనశ్రీ విడాకులు
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటిని నిజం చేస్తూ ఇద్దరూ అధికారికంగా విడిపోయారు. విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తికావడంతో

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటిని నిజం చేస్తూ ఇద్దరూ అధికారికంగా విడిపోయారు. విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తికావడంతో వారి వివాహ బంధం ముగిసింది. చాహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం , పెళ్ళి ఫోటోలు డిలీట్ చేయడం వంటి పరిణామాలతో వీరు విడిపోతున్నట్టు అంతా భావించారు. అనుకున్నట్టు అధికారికంగా విడాకులు తీసుకున్నారు
విడాకుల ప్రక్రియలో భాగంగా చాహల్, ధనశ్రీ వర్మ ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. మొదట ఇద్దరికి 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఇచ్చిన జడ్జి విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ మీరు విడిపోవాలని అనుకుంటున్నారా.. అని అడగగా ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్టు వెల్లడించారు. దీంతో జడ్జి చాహల్-ధనశ్రీ విడాకులకు ఆమోదం తెలిపారు. సుమారు 18 నెలల నుంచి చాహల్, ధనశ్రీ వేర్వేరుగా ఉన్నారని జడ్జి తెలిపారు. కొన్ని నెలల క్రితం చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. విడాకుల తర్వాత ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చాహల్ 60 కోట్ల భరణం ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రెండురోజుల ముందే విడాకుల వార్తలకు బలం చేకూరుస్తూ యుజ్వేంద్ర చాహల్ ఒక పోస్టులో కొత్త జీవితంలో లోడింగ్ అని పోస్ట్ పెట్టాడు. ఒత్తిడి నుంచి విముక్తి లభించిందంటూ ధనశ్రీ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేయగా.. తనను దేవుడే కాపాడాలంటూ యుజ్వేంద్ర చాహల్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా 2020లో లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియో చూసిన తర్వాత చాహల్ ఆమెను డ్యాన్స్ నేర్చుకోవడానికి సంప్రదించాడు.ఆ తర్వాత వారిద్దరూ స్నేహితులవడం.. అనంతరం ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలు కలిసున్న ఈ జంట మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. పలు విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు జరిగిన తర్వాత వేర్వేరుగా ఉంటూ విడాకులకు అప్లై చేసుకున్నారు.