రూ.60 కోట్లు కాదు.. రూ.4.75 కోట్లే ధనశ్రీకి చాహల్ ఇచ్చే భరణం
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వైవాహికి బంధానికి తెరపడింది. వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది.

టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వైవాహికి బంధానికి తెరపడింది. వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో గత కొంతకాలంగా వీరి విడాకులపై వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరూ జూన్ 2022 నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. వారు కుటుంబ కోర్టులో పరస్పర అంగీకారంతో ఉమ్మడి విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో, వారిద్దరూ 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు.
2022 నుంచే విడివిడిగా ఉంటున్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 20 లోపు విడాకుల అంశంపై తుదితీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గురువారం విడాకులను మంజూరు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఐపీఎల్ లో చాహల్ పాల్గొనడంపై ఎలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధనశ్రీకి రూ.4,75 కోట్ల భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించాడు. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించాడు. కాగా ఈ తీర్పు కోసమే యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ జట్టులో ఇంకా చేరలేదు.
మెగావేలంలో పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు చాహల్ ను కొనుగోలు చేసింది. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో విడిగానే ఉంటున్నారు.గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలేట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నరంటూ వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి రోజుకో వార్త వస్తూనే ఉండేది. ఎధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్‌జే మహ్‌వశ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.