అందుకే నువ్వొక అద్భుతం, చాహల్ గాళ్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్
ఐపీఎల్ 18వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఫామ్ లోకి వచ్చేశాడు. కోల్ కత్తాతో మ్యాచ్ లో తన స్పిన్ మ్యాజిక్ తో పంజాబ్ ను గెలిపించాడు

ఐపీఎల్ 18వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఫామ్ లోకి వచ్చేశాడు. కోల్ కత్తాతో మ్యాచ్ లో తన స్పిన్ మ్యాజిక్ తో పంజాబ్ ను గెలిపించాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో 110 పరుగుల స్కోరును పంజాబ్ అద్భుతంగా కాపాడుకుందంటే ప్రధాన కారణం చాహలే. చాహల్ ను.. మెగావేలంలో పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు చాహల్ ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్న చాహల్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచుల్లో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ ఇప్పుడు కేకేఆర్ పై విజయంలో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇదే క్రమంలో చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వేశ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాహల్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేసిన మహ్‌వశ్.. “నీ టాలెంట్ మామూలుగా లేదు. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించావ్.. అసంభవ్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. చాహల్, మహ్‌వశ్ ప్రేమలో ఉన్నారంటూ గతకొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వీరద్దరు కలిసి చూసినప్పటి నుంచీ రూమార్స్ పెరిగాయి. ఈ లవ్ ఎఫైర్ ను వీరిద్దరూ ఖండిస్తున్నా… సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చూస్తుంటే వీరిద్దరి ఖచ్చితంగా సమ్‌థింగ్ సమ్ థింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా 112 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో చహల్ ధాటికి కోల్ కత్తా చేతులెత్తేసింది. కెప్టెన్ అజింక్య రహానే సహా రఘువన్షీ, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్ వికెట్లను తీసిన చాహల్ పంజాబ్ కు చారిత్రక విజయాన్నందించాడు. 4 వికెట్లు తీసిన చాహల్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.