Chahal : చాహల్ నయా రికార్డ్…

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2024 | 03:35 PMLast Updated on: May 08, 2024 | 3:35 PM

Chahals New Record

 

 

 

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ ఈ ఫీట్ సాధించాడు. రిషభ్ పంత్‌ను క్యాచ్ ఔట్‌గా చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 301 మ్యాచ్‌ల్లో చాహల్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 11వ బౌలర్‌గా నిలిచాడు. చాహల్ కన్నా ముందు డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహీర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగా, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ ఈ ఫీట్ సాధించారు.

భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ తర్వాత పియూష్ చావ్లా 293 మ్యాచ్‌ల్లో 310 , రవిచంద్రన్ అశ్విన్ 318 మ్యాచ్‌ల్లో 306 , భువనేశ్వర్ కుమార్ 281 మ్యాచ్‌ల్లో 297 వికెట్లతో ఈ జాబితాలో ఉన్నారు.