Team India: ముంబైలో బౌలర్ల పంజా, మొదటి విక్టరీ ఆల్మోస్ట్ మనదే.!
మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ముంబైలో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతాలు చేస్తుంది.
భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ జట్టును కేవలం 188 పరుగులకే ఆల్ అవుట్ చేసి తమ బౌలింగ్ స్క్వాడ్ సత్తా చాటింది. తన రెండో స్పెల్ లో అదుర్స్ అనిపించినా షమీ, మూడు వికెట్లతో ఏఐసిసి ను కోలుకోలేని దెబ్బ కొట్టగా, సిరాజ్ కూడా మూడు వికెట్లు నేలకూల్చాడు. జడేజా రెండు వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, , కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టి, టీమిండియా తొలి విజయానికి పునాదులు తీశారు. ఇక ఆసీస్ బ్యాటింగ్ లో ఓపెనర్ మిచెల్ మార్ష్ ధాటిగా ఆడి, 65 బంతుల్లో 81 పరుగులు చేసి, జడేజా బౌలింగ్ లో వెనుతిరిగాడు.
ఫీల్డింగ్ విషయంలో కూడా టీమిండియా మెరుగ్గా తమ ప్రతిభను కనబరిచింది. భారత బౌలర్ల ధాటికి, ఆసీస్ ఏ దశలోనూ తేరుకుపోలేకపోయింది. ముప్పై ఆరవ ఓవర్ మధ్యలోనే ఆసీస్ బ్యాటింగ్ లైనప్ చాపచుట్టేసింది. టీమిండియా కాస్త ఓపిగ్గా ఆడితే, మూడు వన్డేల సిరీస్ లో మొదటిది మన వశమైపోవడానికి ఎంతో సమయం పట్టదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు కూడా, ఆసీస్ ను తీవ్రంగా దెబ్బకొట్టాయి. తాను కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మొదటి వన్ డే మ్యాచులోనే పాండ్యా కీలక డెసిషన్స్ తో ఆకట్టుకున్నాడు.