చెన్నై, సన్ రైజర్స్ కు ఛాన్స్ లేదా ? ప్లే ఆఫ్స్ పై ఏబీడీ అంచనా ఇదే

ఐపీఎల్ 18వ సీజన్ మొదలవుతున్న వేళ పలువురు మాజీ క్రికెటర్లు ఈ సీజన్ లో ఏ జట్టు బలంగా ఉందన్న దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 01:55 PMLast Updated on: Mar 21, 2025 | 1:55 PM

Chennai Sunrisers Have No Chance This Is Abds Prediction On The Playoffs

ఐపీఎల్ 18వ సీజన్ మొదలవుతున్న వేళ పలువురు మాజీ క్రికెటర్లు ఈ సీజన్ లో ఏ జట్టు బలంగా ఉందన్న దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఒకడుగు ముందుకేసి ప్లే ఆఫ్స్ చేరే జట్లేవో కూడా చెబుతున్నారు. అయితే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివీలియర్స్ ప్లే ఆఫ్స్ చేరే టీమ్స్ పై చేసిన ప్రెడిక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు టాప్ టీమ్స్ కనీసం లీగ్ స్టేజ్ దాటలేవంటూ డివిలీయర్స్ చేసిన కామెంట్స్ ఆయా జట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరలేవంటూ జోస్యం చెప్పాడు. డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయని తెలిపాడు.

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు చాలా ప‌టిష్టంగా క‌న్పిస్తోందన్నాడు. ఈసారి ముంబై ఇండియ‌న్స్ కూడా క‌చ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందన్నాడు. ఆర్సీబీ కూడా టాప్‌-4లో నిలుస్తుందని అంచనా వేశాడు. ఆర్సీబీ అన్ని విభాగాల్లో స‌మతుల్యంగా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే గుజ‌రాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ మూడు జ‌ట్ల‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుందని డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. అయితే డివిలియ‌ర్స్ ఎంచుకున్న జ‌ట్ల‌లో ఐదు సార్లు ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్‌కింగ్స్ లేక‌పోవ‌డం అభిమానులు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కాగా గతేడాది సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలోని సీఎస్‌కే గ్రూపు స్టేజికే పరిమితమైంది. అలాగే గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ కూడా లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పడుతుందంటూ ఏబీడీ అంచనా వేయడం కూడా చర్చనీయాంశమైంది. బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉన్నా విధ్వంసకర బ్యాటర్లతో సన్ రైజర్స్ బలంగా ఉందంటున్నారు ఫ్యాన్స్…

తన మాజీ టీమ్ ప్లే ఆఫ్ కు వెళుతుందని చెప్పిన డివీలియర్స్ రెండు ఛాంపియన్ టీమ్స్ ను తక్కువ అంచనా వేయడం సరికాదంటున్నారు. ఇదిలా ఉంటే మెగా వేలం తర్వాత లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ పటిష్టంగా మారిందని ఏబీడీ ప్రశంసించాడు. జట్టులో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్‌వుడ్, లుంగి ఎంగిడీ లాంటి కీలకప్లేయర్లు ఉన్నారనీ, వీరంతా ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉన్నవాళ్లేనని చెప్పుకొచ్చాడు. అయితే స్పిన్ విషయంలోనే ఆర్సీబీ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోందన్నాడు. రవి చంద్రన్ అశ్విన్‌ను మిస్ అయ్యామని, అయినప్పటకీ జట్టు కూర్పు బాగుందన్నాడు.ఇదిలా ఉంటే ఐపీఎల్ 18వ సీజన్ శనివారం నుంచే మొదలుకానుంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులను టెన్షన్ పెడుతోంది.