Rishabh Pant: చెన్నై చూపులు రిషబ్ వైపు.. కొత్త కెప్టెన్ అతడేనా..?
ధోనీ తర్వాత చెన్నై జట్టును నడిపించేదెవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ధోనీ తర్వాత చెన్నై జట్టుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్.
Rishabh Pant: ఐపీఎల్‌లో అన్ని జట్లకు కెప్టెన్‌లు మారినా చెన్నై జట్టును మాత్రం ఇంకా ధోనీనే నడిపిస్తున్నాడు. 2008 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా చేసిన మహీ.. 2024 సీజన్ తర్వాత రిటైర్ అయ్యే వకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2023 సీజన్ ధోనీది చివరిదని భావించినా.. ఫ్యాన్స్ కోసం 2024 సీజన్ కూడా ఆడనున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ధోనీ తర్వాత చెన్నై జట్టును నడిపించేదెవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది.
Mohammed Shami: మహ్మద్ షమీకి అర్జున అవార్డ్.. కేంద్ర అవార్డుల ప్రకటన
ధోనీ తర్వాత చెన్నై జట్టుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. బ్యాటర్‌గా అద్భుత ఫామ్‌లో ఉన్న గైక్వాడ్.. చెన్నై భవిష్యత్ సారధిగా కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ సైతం గైక్వాడ్ కెప్టెన్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే చెన్నై సారధిగా భారత వికెట్ కీపర్, బ్యాటర్ రాబోతున్నాడు. వినడానికి షాకింగ్‌గా అనిపించినా చెన్నై సారధి పంత్ అని రిపోర్ట్స్ గట్టిగానే చెబుతున్నాయి. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా ప్రకారం.. ఐపీఎల్ 18వ సీజన్‌కు ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట.
రిషబ్ పంత్ IPL 2025 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించే బలమైన అవకాశం ఉంది. రాబోయే ఎడిషన్ ధోనీకి చివరిది. అతని స్థానాన్ని భర్తీ చేయగల వారు ప్రస్తుత జట్టులో ఎవరూ లేరు. రుతురాజ్ గైక్వాడ్ మంచి బ్యాటర్ అయినప్పటికీ కెప్టెన్ కాలేడు అని గుప్తా స్పోర్ట్స్ టాక్‌లో తెలిపారు.