Tushar Deshpande: ప్రేయసి రావే.. చెన్నై బౌలర్ పెళ్లి
తన చిన్ననాటి స్నేహితురాలు నభ గడ్డంవర్‌ని దేశ్‌పాండే పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. వారి వివాహ వేడుకకు పలువరు క్రికెటర్లు హాజరయ్యారు.

Tushar Deshpande: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ తుషార్ దేశ్‌పాండే ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం తన చిన్ననాటి స్నేహితురాలు నభ గడ్డంవర్‌ని దేశ్‌పాండే పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. వారి వివాహ వేడుకకు పలువరు క్రికెటర్లు హాజరయ్యారు. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను దేశ్‌పాండే ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశాడు.
MS DHONI: సైన్యంలోకి ధోని.. అప్పుడే చెప్పాడు..
‘హృదయాల మార్పిడితో నవ జీవితానికి నాంది అంటూ’ అని క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ కొత్త జంటకు చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపింది. ‘జీవితకాలంలో ప్రేమ, సంతోషం, అనుబంధాన్ని ఒకరికరూ పంచుకుని కలిసిమెలిసి జీవించండి. కంగ్రాట్స్ టు సూపర్ కపుల్’ అని సీఎస్‌కే ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా చిన్నతనం నుంచి దేశ్‌పాండే, నభ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. స్కూల్‌డేస్ నుంచి మొదలైన స్నేహం.. కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించిన ఈ జంట.. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున దేశ్‌పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఫైనల్‌లో కూడా అదరగొట్టి చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో తుషార్ దేశ్‌పాండే తన వంతు పాత్ర పోషించాడు.