Chennai Super Kings: ఫాలోయింగ్ లో చెన్నై తోపు 10 మిలియన్ క్లబ్
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

Chennai Super Kings X continues to be the number one Twitter account
ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సాధించింది. ఎక్స్ ట్విటర్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ’10 మిలియన్ ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న X-ట్రీమ్ ఎల్లోవ్ మరియు ఈలలకు ధన్యవాదాలు’ అని సీఎస్‌కే ఎక్స్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్స్‌లో10 మిలియన్ ఫాలోవర్స్ ఫీట్ సాధించిన ఐపీఎల్ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్ర స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 8.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్ధానంలో ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6.8.. కోల్‌కతా నైట్ రైడర్స్ 5.2.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 3.2 మిలయన్ల ఫాలోవర్లతో టాప్-5లో ఉన్నాయి. చెన్నై సారథి ధోనీకి ప్రప్రాంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్న విషయం తెలిసిందే. చెన్నైకి కొండంత అండ మహీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2023 విజేతగా చెన్నైసూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తంగా చెన్నై ఖాతాలో ఐదు ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఐదు టైటిల్స్ కూడా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే వచ్చాయి. ఐపీఎల్ 2023 విజయంతో అత్యధిక టైటిల్స్‌ను గెలిచిన ముంబై ఇండియన్స్ రికార్డను సమం చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.