T20 indian players : టీ20 ప్రపంచ కప్ కి కౌంట్ డౌన్

ఐపీఎల్ ముగింపునకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పొట్టికప్ పై పడింది. ఈ కప్‌ను పట్టేసేందుకు ..వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీపడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2024 | 10:35 AMLast Updated on: May 26, 2024 | 10:35 AM

Countdown To T20 World Cup

ఐపీఎల్ ముగింపునకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పొట్టికప్ పై పడింది. ఈ కప్‌ను పట్టేసేందుకు ..వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీపడుతున్నాయి. జూన్ 2న టోర్నీ ప్రారంభం కావడంతో .. మ్యాచ్‌ల కోసం కొందరు టీమిండియా ఆటగాళ్లు అమెరికా చేరుకున్నారు.

జూన్ 2న టీట్వంటీ ప్రపంచకప్ సమరం ప్రారంభం అవుతోంది. ఐపీఎల్ ముగింపునకు రావడంతో… భారత ఆటగాళ్లు వెంటనే నెక్ట్స్ ప్లాన్ కి సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కెప్టన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సహా మరికొందరు ఆటగాళ్లు అమెరికాకి వెళ్ళారు. టీ ట్వంటీ నెంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, జడేజా, రిషబ్ పంత్, శివం దూబె, అర్షదీప్ సింగ్ సహా కొందరు ఆటగాళ్లు ముందస్తుగా అమెరికా చేరుకున్నారు. వీళ్ళతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో పాటు కోచింగ్ సిబ్బంది కూడా వెళ్ళారు. ముందే అమెరికా చేరుకోవడంతో అక్కడి పరిస్థితులు అలవాటు పడేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందన్నది మేనేజ్‌ మెంట్ భావనగా తెలుస్తోంది.

ఐపీఎల్ క్వాలిఫయర్-2 ఆడిన రాజస్థాన్ ప్లేయర్లు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఐపీఎల్ ఫైనల్ ఆడాల్సిన కోల్‍కతా బ్యాటర్ రింకూ సింగ్ ఇప్పుడు టీమిండియాతో అమెరికా వెళ్లలేదు. వాళ్ళు తొందర్లోనే బయలుదేరతారు. టోర్నీలో జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే గ్రూప్‌ మ్యాచ్‌తో భారత్ ప్రపంచకప్ వేటను మొదలుపెట్టనుంది. అమెరికా, విండీస్, వేదికగా ఈ మెగాటోర్నీ జరగనుంది.