IPl2023: నువ్‌ మారవా అశ్విన్‌ బ్రో.. మళ్లీ రచ్చకెక్కిన మన్కడింగ్ చర్చ

మనం మనం బరంపురం.. నిన్న జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో అశ్విన్ చేసిన పనికి అందరికి గుర్తొచ్చే డైలాగ్ ఇది. అశ్విన్ చేసిన పనికి ఆడియన్స్ మెచ్చుకుంటే అదే టీమ్‌లో ఉన్న బట్లర్ నొచ్చుకున్నాడు. రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో ఆశ్విన్ బౌలింగ్‌లో పంజాబ్‌ కెప్టెన్ ధావన్ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్నాడు.. బాల్ వేసే టైమ్‌లో ముందుకు వెళ్ళాడు.  మన్క్‌డింగ్ చాన్స్ ఉన్నా అవుట్‌ చేయకుండా వదిలేసాడు అశ్విన్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2023 | 03:30 PMLast Updated on: Apr 06, 2023 | 3:30 PM

Cricket Bowler Ashwin

2019లో సేమ్‌ సిచ్యువేషన్‌ ఫేస్‌ చేశాడు అశ్విన్‌. అప్పటి మ్యాచ్‌లో ఇలాగే ముందుకు వచ్చిన బట్లర్‌ను ఔట్‌ చేశాడు అశ్విన్‌. కానీ ఇప్పుడు మాత్రం ధావన్‌ను వదిలేశాడు. ఇలా చేయడంపై ఇంటర్‌నెట్‌లో రచ్చ జరుగుతోంది. ధావన్ ఇండియన్ ప్లేయర్ కావడంతోనే అశ్విన్ ఇలా చేసాడని కొంత మంది.. లేదు అశ్విన్ ధావన్‌కు వార్నింగ్ ఇచ్చాడని కొంత మంది మాట్లాడుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్‌ జరగగానే కెమెరామ్యాన్‌ వెంటనే బట్లర్‌ను ఫోకస్‌ చేశాడు. బట్లర్‌ మొహంలో అసహనం కొట్టొచ్చునట్టు కనిపించిందంటున్నారు వ్యూవర్స్‌.

కాగా 2022 నుంచి బట్లర్‌, అశ్విన్ రాజస్థాన్ తరుపున ఆడుతున్నారు. గతంలో అశ్విన్ మన్క్‌డింగ్ చేసినపుడు. బట్లర్ రాజస్థాన్‌కి, అశ్విన్ పంజాబ్‌కి ఆడారు. అప్పట్లో అశ్విన్ చేసింది క్రీడ స్పూర్తికి విరుద్దం అన్న కొందరు.. ఇప్పుడు మాత్రం అశ్విన్ చేసింది తప్పు అంటున్నారు. గతంలో మన్క్‌డింగ్ క్రికెట్ రూల్స్‌లో ఉన్నా.. ఎక్కువగా వాడేవారు కాదు.. ఒకవేళ దాన్ని యూజ్‌ చేసినా చాలా వరకు ఫస్ట్‌ వార్నింగ్ ఇచ్చే వాళ్లు. 2022లో ఐసీసీ కొత్త రూల్స్‌లో మన్క్‌డింగ్‌కి సపోర్ట్‌గా కొత్త రూల్స్‌ పెట్టినా.. అవుట్‌ చేయాలా వద్దా అనే విషయం బౌలర్‌ చేతిలోనే ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో అశ్విన్ చేసిన దానికి మళ్లీ ఈ మ్యాటర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.