Kashmir, Sachin Tendulkar : కాశ్మీర్ రోడ్లపై క్రికెట్ ఆడిన.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్..
క్రికెట్ (Cricket) ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ అభిమానులకే కాదు.. దేశంలో గల్లిలో ఆడే ప్రతి క్రికెట్ పిల్లవాడికి సైతం ఆయన పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయన ఆట చూడడానికి విదేశాలో ఉన్న అభిమానులు సైతం క్రికెట్ స్టేడియం ముందు వాలిపోతారు అంటే నమ్మండి.
క్రికెట్ (Cricket) ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ అభిమానులకే కాదు.. దేశంలో గల్లిలో ఆడే ప్రతి క్రికెట్ పిల్లవాడికి సైతం ఆయన పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయన ఆట చూడడానికి విదేశాలో ఉన్న అభిమానులు సైతం క్రికెట్ స్టేడియం ముందు వాలిపోతారు అంటే నమ్మండి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచానికి క్రికెట్ ఆట మైదానం గుడి అయితే.. ఆ మైదానంలో ఆడే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) దేవుడు. విదేశాల్లో క్రికెట్ పేరు ఎత్తగానే.. ముందుగా వచ్చే మాట సచిన్.. అంత ఫేమస్ మరి సచిన్ అంటే.. నిజానికి సచిన అంటే పేరు కాదు.. ఇండియా క్రికెట్ కి ఆ పేరు ఓ బ్రాండ్ అని చెప్పాలి. అంతర్జాతీయ ఆటల్లో ఆయన పేరు తెలియని.. తలువని క్రికెట్ ఆటగాడు అంటూ ఉండడు. దేవుడు కన్న ఎక్కువ.. ఇప్పుడేందుకు సచిన్ గురించి ఇంత వివరిస్తున్నారు అంటారా.. అక్కడికే వస్తున్నా..
గత కొన్ని రోజులుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాశ్మీర్ లో పర్యటిస్తున్న సమయంలో కొంత మంది కాశ్మీరి క్రికెట్ ఆడుతు సచిన్ కు కనిపించారు. క్రికెట్ ని చూడగానే ఆయన ఆగుతారా.. ఇంకేముంది.. బ్యాట్ చూస్తేనే సచిన్ చేయి ఆటోమేటిగ్ వెళ్లిపోతుంది. వెంటనే కారు దిగి.. నేను మీతో ఆడవచ్చా అడిగడంతో.. సాక్ష్యాత్తు క్రికెట్ దేవుడే దిగి వచ్చి.. నేనూ మీతో క్రికెట్ ఆడుతా అంటూ వాళ్లు మాత్రం వద్దంటారా? వెంటనే బ్యాట్ ను సచిన్ చేతుల్లో పెట్టేసి ఫిల్డింగ్ కు వెల్లపోయారు. కొద్ది సేపు వాళ్లను ఉత్సాహపరుస్తూ.. సచిన్ తన స్టైల్ లో కొన్ని షాట్లు కోట్టడం అన్ని చకచక జరిగిపోయాయి. మరి ఎంతా అంటే సచిన్ ఇదే చివరి బాల్ అంటూ బ్యాట్ ను తిప్పి మరి కోట్టాడు..సాధారణంగా ఎవరైనా ఇలా ఆడితే.. పక్క వారి వికెట్ పడిపోవాల్సిందే.. కానీ అదే సచిన్ ఆడితే.. ఆ బాల్ స్టార్ట్ పడాల్సిందే.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అని ఊరికే అంటారా మరి.
దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా స్వయంగా సచిన్ షేర్ చేశారు. ‘స్వర్గంలో ఒక మ్యాచ్’ అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సచిన్ కశ్మీర్ రోడ్లపై క్రికెట్ ఆడిన వీడియోలు తేగా వైరల్‌గా అవుతున్నాయి. ఇక కాశ్మీర్ ను మనం స్వర్గంలో పిలుస్తామి.. మరి ఆ స్వర్గంలో క్రికెట్ గాడ్ బ్యాటింగ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV
— Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024