Cricket World Cup 2023: ప్రపంచకప్ మ్యాచులు తెలుగులో ఫ్రీగా చూడండి..!

ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లను అభిమానులు వీక్షించవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2023 | 03:23 PMLast Updated on: Oct 02, 2023 | 3:23 PM

Cricket World Cup 2023 Will Be Strem And Live Telecast For Free In Star Plus And Disney Plus Hot Star App

Cricket World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లను అభిమానులు వీక్షించవచ్చు. మొత్తం 9 భాషల్లో మెగా టోర్నీ మ్యాచ్‌లు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. 9 భాషల్లో వ్యాఖ్యానించేందుకు స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే 120 మంది వ్యాఖ్యాతలను ఎంపిక చేసింది.

ఇందులో పలు దేశాల మాజీ ఆటగాళ్లు ఉన్నారు. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, శ్రీశాంత్, సునీల్ జోషి, ఎంఎస్‌కే ప్రసాద్, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, షేన్ వాట్సన్, నాజర్ హుస్సేన్, ఇయాన్ మోర్గాన్, షాన్ పొలాక్, మిథాలీ రాజ్‌ వ్యాఖ్యాతలుగా ఉన్నారు. తెలుగు వ్యాఖ్యాతలుగా వేణుగోపాలరావు, మిథాలీరాజ్‌, ఎమ్మెస్కే ప్రసాద్‌, ఆర్జే శశి, యాంకర్‌ రవి, హీరో నందు, టి సుమన్‌, ఆశిష్‌ రెడ్డి, కల్యాణ్‌ కృష్ణ, జ్ఞానేశ్వర రావు, రాకేష్‌ దేవా, ఎన్‌సీ కౌషిక్‌, వింద్య విశాఖ వ్యవహరించనున్నారు. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.

హాట్‌స్టార్ వెబ్‌సైట్ ద్వారా చూడాలనుకునేవారు తప్పనిసరిగా సబ్క్స్రిప్షన్ కలిగి ఉండాలి. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడుతాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది.