Rahmanullah Gurbaz : ఫుట్ పాత్ మీద పేదలకు.. ఆస్తిని పంచుతున్న క్రికెటర్..
అఫ్గానిస్తాన్ (Afghanistan) స్టార్ ఓపెనర్ (Star Opener) రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్‌ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు.

Cricketer distributing property to the poor on the footpath
అఫ్గానిస్తాన్ (Afghanistan) స్టార్ ఓపెనర్ (Star Opener) రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్‌ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నిరాశ్రయులకు గుర్బాజ్ నగదు సాయం చేశాడు. అది కూడా తెల్లవారుజామున 3 గంటలకు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో గుర్బాజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నిజంగా నీవు రియల్ హీరో అన్న, దీపావళి పండగ రోజు వారి ముఖాల్లో సంతోషాన్ని నింపావు” అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 4 విజయాలతో అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో నిలిచింది. గుర్భాజ్ కూడా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేశాడు.