Mohammed Shami: మహ్మద్ షమీకి అర్జున అవార్డ్.. కేంద్ర అవార్డుల ప్రకటన
‘ఖేల్ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు.

Mohammed Shami: 2023 సంవత్సరానికి గానూ నేషనల్ స్పోర్ట్స్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇండియాలో క్రీడా రంగంలో అతిపెద్ద పురస్కారం ‘ఖేల్ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు.
Sanitary Napkin: ప్రభుత్వ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్.. హైకోర్టు ఆదేశం
ఇక.. 26 మందికి అర్జున అవార్డ్స్ ప్రకటించింది కేంద్రం. అందులో క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. ఈ జాబితాలో పారా ఆర్చర్ శీతల్ దేవి పేరు కూడా ఉంది. అంతేకాకుండా.. ఏపీకి చెందిన టీమిండియా అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. కబడ్డీ ప్లేయర్ పవన్ కుమార్, రెజ్లర్ సునీల్ కుమార్, చెస్ క్రీడాకారిణి వైశాలి అవార్డులకు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.
కాగా.. సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌లో భారత జెండాను ఎగురవేశారు. హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో ఈ జోడీ భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. మరోవైపు.. 2023 ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.