Sandeep Lamichhanne: రేప్ కేసులో దోషిగా తేలిన క్రికెటర్.. కెరీర్ ముగిసినట్టేనా..?
బెయిల్‌పై ఉన్న సందీప్ కొన్ని నెలలుగా దేశం తరఫున పలు టోర్నీలు కూడా ఆడాడు. తాజాగా ఈ కేసు విచారణ ముగిసింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సందీప్ దోషిగా నిర్థారించింది. అతడి శిక్షపై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
Sandeep Lamichhanne: మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచనేని దోషిగా తేలాడు. బాలికను అతను రేప్ చేసినట్టు కోర్టు విచారణలో తేలింది. నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో సందీప్.. తనను హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో ఖాట్మండులోని ఒక హోటల్‌లో జరిగినట్లు తెలిసింది. కేసు నమోదైన వెంటనే పోలీసులు సందీప్ లామిచానేను అరెస్ట్ చేశారు.
Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!
తర్వాత సందీప్‌ను రూ.20 లక్షల పూచికత్తుతో బెయిల్‌పై కోర్టు విడుదల చేసింది. బెయిల్‌పై ఉన్న సందీప్ కొన్ని నెలలుగా దేశం తరఫున పలు టోర్నీలు కూడా ఆడాడు. తాజాగా ఈ కేసు విచారణ ముగిసింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సందీప్ దోషిగా నిర్థారించింది. అతడి శిక్షపై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సందీప్ శిక్షపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది. జనవరి 10న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సందీప్‌కు పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు అతడు తెలిపాడు.
సందీప్ దోషిగా తేలడంతో విదేశీ లీగ్‌లలో ఆడకుండా అతనిపై కోర్టు నిషేధం విధించింది. 23 ఏళ్ల ఈ నేపాలీ క్రికెటర్ ఇప్పటి వరకూ 51 వన్డేలు, 52 టీ ట్వంటీలు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సందీప్.. 9 మ్యాచ్ లు ఆడాడు. విదేశీ లీగ్స్ అయిన బిగ్ బాష్, పీఎస్ఎల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ సందీప్ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తాజా పరిణామాలతో అతని క్రికెట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది.