Cricketers, Olympics : క్రికెటర్ల చర్చంతా 2028 ఒలింపిక్స్ పైనే.. మాజీ కోచ్ ద్రావిడ్ కామెంట్స్
ఒలింపిక్స్ (Olympics) లో క్రికెట్ (Cricket) ను చేరిస్తే ఖచ్చితంగా భారత్ కు గోల్డ్ మెడల్ (Bharat Gold Medal) వస్తుందనేది చాలా మంది అభిమానుల మాట..

Cricketers are all talking about 2028 Olympics.. Former coach Dravid comments
ఒలింపిక్స్ (Olympics) లో క్రికెట్ (Cricket) ను చేరిస్తే ఖచ్చితంగా భారత్ కు గోల్డ్ మెడల్ (Bharat Gold Medal) వస్తుందనేది చాలా మంది అభిమానుల మాట.. నిజమే దీని గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా విశ్వక్రీడల్లో (World Games) మాత్రం క్రికెట్ కు చోటు లభించడం లేదు. అయితే లాస్ ఏంజెల్స్ (Los Angeles) వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా (Team India) కోచ్ రాహుల్ ద్రావిడ్ (Coach Rahul Dravid) దీనిపై స్పందించాడు. ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం కోసం ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు. 2028 ఒలింపిక్స్ (2028 Olympics) గురించి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పటినుంచే సీరియస్‌గా చర్చ నడుస్తోందని తెలిపాడు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన ద్రవిడ్ అక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2028 లాస్ ఏంజిల్స్ (2028 Los Angeles) ఒలింపిక్స్‌లో క్రికెట్ అంశంపై పారిస్‌లో ప్యానెల్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో ద్రవిడ్ పాల్గొన్నాడు. ఈ విశ్వ క్రీడల్లో తాము భాగం కావాలని, పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని క్రికెటర్లు (Cricketers) ఎదురుచూస్తున్నారని ద్రవిడ్ చెప్పాడు. దీనికోసం ఇప్పటినుంచే సన్నద్ధత మొదలుపెట్టారని వెల్లడించాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ కు ఎంట్రీ లభిస్తే భారత మహిళా (Indian women), పురుషుల జట్లు కచ్చితంగా స్వర్ణం గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.