JADEJA WICKET : వివాదాస్పదమైన జడేజా వికెట్
హైదరాబాద్ టెస్టులో అంపైరింగ్ (Umpiring) పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడోరోజు రవీంద్ర జడేజా (Jadeja) ఔట్ తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సెషన్‌లో రవీంద్ర జడేజాను చూస్తుంటే.. టెస్టు కెరీర్‌లో నాలుగో సెంచరీ చేస్తాడని అనిపించినా.. 120వ ఓవర్లో జో రూట్ బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Criticism of umpire on Ravindra Jadeja's out-wicket in Hyderabad Test
హైదరాబాద్ టెస్టులో అంపైరింగ్ (Umpiring) పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడోరోజు రవీంద్ర జడేజా (Jadeja) ఔట్ తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సెషన్‌లో రవీంద్ర జడేజాను చూస్తుంటే.. టెస్టు కెరీర్‌లో నాలుగో సెంచరీ చేస్తాడని అనిపించినా.. 120వ ఓవర్లో జో రూట్ బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే, జడేజా వికెట్ ప్రస్తుతం వివాదంగా మారింది. రూట్ వేసిన బంతికి రవీంద్ర జడేజా ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేశాడు. ఈ సమయంలో బంతి అతని ప్యాడ్‌లకు తగిలింది. అంపైర్ అతడిని ఔట్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి అతని బ్యాట్‌కు తగిలి ప్యాడ్‌లకు తగిలినట్లు కనిపించింది.
దీని తర్వాత థర్డ్ అంపైర్ (Third umpire) తనకు అందుబాటులో ఉన్న అన్ని టెక్నిక్‌లను ఉపయోగించాడు. బంతి జడేజా ప్యాడ్‌లకు తగిలిందా లేదా బ్యాట్‌కు తగిలిందా అనే విషయాన్ని థర్డ్ అంపైర్ నిర్ధారించలేకపోయాడు. చాలా సేపు రీప్లే కొనసాగించి జడేజాను ఔట్ చేశాడు. రీప్లేలో బంతి జడేజా బ్యాట్, ప్యాడ్ లకు ఒకేసారి తగిలినట్టు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ కాల్ కే వదిలేయడంతో జడ్డూ వెనుదిరగాల్సి వచ్చింది. నిజానికి డీఆర్ఎస్ తీసుకున్నప్పుడు అంపైర్స్ కాల్ చాలారోజులుగా చర్చనీయాంశమవుతోంది. రీప్లేలో ఏదీ తేలనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జడేజాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో సెంచరీ చేజారిందని అభిమానులు మండిపడుతున్నారు.