RCB VS CSK: బెంగుళూరు ఓటమికి కారణాలివే..

సాధారణంగా టీ20 ఫార్మట్‌లో టాస్ గెలిచిన జట్టు కెప్టెన్.. తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంటాడు. కానీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దీనికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 04:41 PMLast Updated on: Mar 23, 2024 | 4:41 PM

Csk Beat Rcb Csk Won By 6 Wickets Here Is The Reason Fos Rcb Loss

RCB VS CSK: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ఆరంభించింది. చెన్నైతో మ్యాచ్‌లో అభిమానులను ఉసూరుమనిపించింది. తొలుత బ్యాటింగ్, ఆ తరువాత బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఈ ఓటమికి టాస్ గెలవడంతోనే బీజం పడినట్టయింది. సాధారణంగా టీ20 ఫార్మట్‌లో టాస్ గెలిచిన జట్టు కెప్టెన్.. తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంటాడు. కానీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దీనికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.

Sunrisers Hyderabad: కేకేఆర్‌తో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్ బోణీ కొడుతుందా..?

దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. తొలి ఆరు ఓవర్లలోనే వరుస వికెట్లు పడటం వారి అధ్వానపు ఆటతీరుకు అద్దం పట్టినట్టయింది. అపారమైన అనుభవం ఉన్న ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. సమయానుకూలంగా ఆడలేకపోయారు. ప్రారంభ ఓవర్లల్లో ధాటిగా ఆడిన ఫాఫ్, కోహ్లీ.. కొద్దిగా సంయమనం పాటించి ఉంటే క్రీజ్‌లో నిలదొక్కుకునే వాళ్లు. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డకౌట్.. టాప్ ఆర్డర్ రిథమ్‌ను దెబ్బకొట్టింది. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కామెరాన్ గ్రీన్ మినహా మరెవరూ కూడా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

అంచనాలు పెట్టుకున్న మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఇక డుప్లెసిస్‌ కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బౌలర్లను మార్చడంలో వైవిధ్యాన్ని చూపలేకపోయాడు. ఏకంగా ఏడుమంది బౌలర్లను ప్రయోగించినప్పటికీ సానుకూల ఫలితాన్ని రాబట్టలేకపోయాడు.