MS DHONI: థాంక్యూ కెప్టెన్.. ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్
ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ధోనీని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ధోనీని దక్కించుకుని సారథిగా నియమించింది. అప్పటి నుంచి సీఎస్కే.. కెప్టెన్ విషయంలో వెనుదిరిగి చూసుకోలేదు.
MS DHONI: ధోనీ అంటే చెన్నై.. చెన్నై అంటే ధోనీ.. ఈ మాట చాలు ధోనీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు, చెన్నై ఫ్యాన్స్‌కు ఉన్న అనుబంధం ఏంటో చెప్పడానికి. నిజమే ధోనీ చెన్నైలో పుట్టలేదు. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు కూడా కాదు. అయితేనేం భారత క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. రెండు వరల్డ్ కప్‌లు అందించిన సారథి. అందుకే ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ధోనీని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ధోనీని దక్కించుకుని సారథిగా నియమించింది. అప్పటి నుంచి సీఎస్కే.. కెప్టెన్ విషయంలో వెనుదిరిగి చూసుకోలేదు.
T CONGRESS: ఎన్నికల తర్వాత సీఎంగా పొంగులేటి..? కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
తొలి సీజన్‌లోనే చెన్నైని ఫైనల్‌కు చేర్చిన ఘనత అతని సొంతం. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో టైటిల్ అందించాడు. అంతేకాదు.. ధోని కెప్టెన్సీలో సీఎస్‌కే 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గానూ నిలిచింది. నిజానికి 2022లోనే మహి కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అయితే ఈ నిర్ణయం బెడిసికొట్టింది. కెప్టెన్‌గా భారాన్ని మోయలేక తీవ్ర ఒత్తిడికి లోనైన జడ్డూ.. ఆల్‌రౌండర్‌గానూ విఫలమై విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో మళ్లీ ధోనినే కెప్టెన్సీ చేపట్టాడు. ఆ చేదు జ్ఞాపకాలను మరిపించేలా 2023లో చెన్నైకి పూర్వవైభవం అందించాడు. 41 ఏళ్ల వయసులో సీఎస్‌కేను ఐదోసారి చాంపియన్‌గా నిలబెట్టాడు. ఇప్పుడు 17వ సీజన్ ఆరంభానికి ముందు రుతురాజ్ కు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
అయితే ఈ ప్రకటన సీఎస్‌కేతో పాటు ఐపీఎల్ సగటు అభిమాని గుండెను కూడా ముక్కలు చేసింది. సారథిగా ధోనీని ఇక చూడలేమా అంటూ తలా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు మంచిదే అయినా.. ఓ స్వర్ణ యుగం ముగిసిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ధోని పట్ల అభిమానం చాటుకుంటూ వీడియోలు షేర్ చేస్తూ అతడి పేరును ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీ వదిలేసిన వార్త ట్రెండింగ్ లో నడుస్తోంది.