ఆ ప్లేయర్స్ కు చెన్నై షాక్ సీఎస్కే గుడ్ బై చెప్పేది వీరికే
ఐపీఎల్ మెగావేలం కోసం ఈ సారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను ఇంకా ప్రకటించకున్నా తమ తమ జాబితాపై చాలా ఫ్రాంచైజీలు దాదాపుగా క్లారిటీకి వచ్చేశాయి.
ఐపీఎల్ మెగావేలం కోసం ఈ సారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను ఇంకా ప్రకటించకున్నా తమ తమ జాబితాపై చాలా ఫ్రాంచైజీలు దాదాపుగా క్లారిటీకి వచ్చేశాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగలబోతోంది. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్ళకు గుడ్ బై చెప్పనుంది. ఈ జాబితాలో ముందుగా శార్దూల్ ఠాకూర్ పేరే వినిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా చెన్నైకి ఆడుతున్న శార్థూల్ కు 2024 ఐపీఎల్ సీజన్ మాత్రం నిరాశనే మిగిల్చింది. 9 మ్యాచ్ లు ఆడిన ఈ ముంబై పేసర్ కేవలం ఐదే వికెట్లు తీశాడు. దీంతో 4 కోట్లకు గతంలో రిటైన్ చేసుకున్న చెన్నై ఈసారి అతన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది.
అలాగే మరో పేసర్ దీపక్ చాహర్ కు కూడా సీఎస్కే గుడ్ బై చెప్పబోతోంది. గత సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడి కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టిన దీపక్ చాహర్ ఫామ్ అత్యంత పేలవంగా ఉంది. గత సీజన్ కంటే ముందు అద్భుతమైన స్వింగ్ డెలివరీస్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన దీపక్ చాహర్ తన లయను కోల్పోయాడు. దీనికి తోడు గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు కూడా అతనికి ఇబ్బందిగా మారాయి. ఇక విదేశీ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్రను కూడా చెన్నై వేలంలోకి విడిచిపెట్టబోతోంది. వన్డే ప్రపంచకప్ లో భారత్ పిచ్ లపై అదరగొట్టిన ఈ కివీస్ యువ ఓపెనర్ ను చెన్నై 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. 10 మ్యాచ్ లలో 222 పరుగులు చేసినా నిలకడ లేకపోవడం రచిన్ కు మైనస్ పాయింట్. దీంతో అతన్ని కూడా వేలంలోకి విడిచిపెట్టాలని భావిస్తోంది.