RCB ప్లేయర్సే చెన్నై టార్గెట్, డాడీస్ ఆర్మీ స్కెచ్ ఇదే
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీఅరేబియా సిటీ జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోగా.. ఈసారి మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీఅరేబియా సిటీ జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిపోగా.. ఈసారి మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరితో పాటు అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు కూడా ఉన్నారు. మొత్తం 1,574 క్రికెటర్లలో ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.
కాగా ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు డాడీస్ ఆర్మీగా పేరుంది. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఆటగాళ్ళను తీసుకుని ఫలితాలు రాబట్టింది. దీంతో ఈ సారి కూడా వేలంలో పలువురు సీనియర్ ప్లేయర్స్ నే తీసుకోబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్ళపై కన్నేసినట్టు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ చేసిన ఆటగాళ్లలో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్, సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు. ఆర్‌సీబీకి కంటే ముందు డుప్లెసిస్ చెన్నై జట్టుకే ఆడాడు. ప్రస్తుతం సీఎస్‌కేకు ఒక ఓపెనర్ కావాల్సి ఉండడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు జతగా డుప్లెసిస్ సరిగ్గా సరిపోతాడని ఆ జట్టు భావిస్తోంది. అయితే ఫాఫ్ డుప్లెసిస్ కోసం ఆర్‌సీబీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించే అవకాశం ఉంది. డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ పట్టించుకోకుంటే మాత్రం సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంటుంది.
ఇక ఆసీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్‌ను కూడా తీసుకునేందుకు సీఎస్‌కే ఆసక్తిగా ఉంది. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడటంతో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెన్నై చెపాక్ మైదానానికి సరిగ్గా సరిపోతాడని సీఎస్‌కే భావిస్తోంది. అయితే మ్యాక్సీ కోసం కూడా ఆర్‌సీబీ ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగిస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ గత సీజన్ లో మాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. సీజన్ మొత్తంలో కేవలం 54 పరుగులే చేశాడు. అయినప్పటకీ చెన్నై అతని కోసం ప్రయత్నించబోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు మాక్స్ వెల్ మాత్రం బెంగళూరు టీమ్ కే ఆడలానుకుంటున్నట్టు తన మనసులో మాట చెప్పాడు.
ఇక ఆర్సీబీ వదిలేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కూడా చెన్నై ఎదురుచూస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలే విల్ జాక్స్‌ను తీసుకుంటే తమ తుది జట్టులో డెప్త్ పెరుగుతుందని సీఎస్‌కే భావిస్తోంది. అతని అనుభవం తమ జట్టుకు కలిసొస్తుందనేది చెన్నై వర్గాల మాట. ఇక ఈ సారి వేలంలో ఎవరూ జాక్ పాట్ కొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధికంగా 24.75 కోట్ల రికార్డు ధర పలికాడు. అదే జట్టుకు చెందిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. రెండో స్థానంలో నిలిచాడు. ఈ సారి మెగా వేలంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు ఉండటంతో ఎవరు రికార్డు ధర పలుకుతారనేది చూడాలి.