టెస్టుల్లో గొప్ప క్రికెటర్ అవుతాడు యువ క్రికెటర్ పై దాదా కామెంట్స్
క్రికెటర్ నైపుణ్యం బయటకొచ్చేది టెస్ట్ ఫార్మాట్ తోనే... టీ ట్వంటీ తరహాలో మెరుపులు మెరిపించినా సుధీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడినప్పుడు ఆటగాడి సత్తా తెలిసేది. అది కేవలం రెడ్ బాల్ క్రికెట్ లోనే సాధ్యం...
క్రికెటర్ నైపుణ్యం బయటకొచ్చేది టెస్ట్ ఫార్మాట్ తోనే… టీ ట్వంటీ తరహాలో మెరుపులు మెరిపించినా సుధీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడినప్పుడు ఆటగాడి సత్తా తెలిసేది. అది కేవలం రెడ్ బాల్ క్రికెట్ లోనే సాధ్యం…ప్రస్తుతం భారత క్రికెట్ టీమ్ లో టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి నిలకడగా రాణించే ఆటగాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. మరి భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ లో ఎవరు అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. టెస్ట్ ఫార్మాట్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్థాయికి చేరుకునే సత్తా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఉందని వ్యాఖ్యానించాడు. అతను టెస్టు జట్టులోకి తిరిగొచ్చినందుకు తనకేమి ఆశ్చర్యం లేదన్నాడు.
పంత్ అత్యుత్తమ క్రికెటర్ గా ఎదగాలంటే ఇదే ఆటతీరు కొనసాగించాలని దాదా సూచించాడు. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను ఆటను మెరుగుపర్చుకోవాలని చెప్పాడు. పంత్ కు ఉన్న ప్రతిభతో ఖచ్చితంగా గ్రేటెస్ట్ క్రికెటర్ అవుతాడని గంగూలీ జోస్యం చెప్పాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా పర్యటనకు షమి అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కంగారూలతో టెస్టు సిరీస్ కోసం తాను కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. భారత జట్టుకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అసలైన సవాల్ గా ఉంటుందని అంచనా వేశాడు.