ఇక దబిడి దిబిడే రోహిత్,కోహ్లీలపై దాదా కామెంట్స్

గత కొంతకాలంగా భారత క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరుగుతున్న చర్చ మరెవరి గురించీ జరగడం లేదు. ఎన్నో ఏళ్ళుగా పరుగుల వరద పారిస్తూ రికార్డుల మోత మోగించిన వీరిద్దరూ ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. ఆసీస్ టూర్ లో ఉండగానే రోహిత్ టెస్టులకు సైతం గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నా...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2025 | 04:55 PMLast Updated on: Feb 04, 2025 | 4:55 PM

Dada Comments On Rohit Kohli

గత కొంతకాలంగా భారత క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరుగుతున్న చర్చ మరెవరి గురించీ జరగడం లేదు. ఎన్నో ఏళ్ళుగా పరుగుల వరద పారిస్తూ రికార్డుల మోత మోగించిన వీరిద్దరూ ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. ఆసీస్ టూర్ లో ఉండగానే రోహిత్ టెస్టులకు సైతం గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నా… మళ్ళీ వెనక్కి తగ్గాడు. అటు కోహ్లీ కూడా తనకి కలిసొచ్చిన కంగారూ గడ్డపై అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వీరిద్దరి ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. దేశవాళీ క్రికెట్ బరిలో దిగినప్పటకీ రోహిత్, కోహ్లీ టచ్ లోకి రాలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మెగాటోర్నీలో ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా రోహిత్ , కోహ్లీ ఫామ్ గురించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే జరగబోయే ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు అదరగొడతారని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ క్రికెటర్లని వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే ఈ ఫార్మాట్ లో వాళ్లకు మంచి రికార్డు ఉందని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్లు బాగా రాణిస్తారన్నాడు. ముఖ్యంగా దుబాయ్ లో బాగా ఆడతారని , ఈ విషయంలో అభిమానులు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దంటూ దాదా చెప్పుకొచ్చాడు. గత వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరు బాగా రాణించిన విషయాన్ని గంగూలీ గుర్తు చేశాడు.ఎన్నో ఏళ్ళుగా ఎంతో క్రికెట్ ఆడిన వీరిద్దరూఇలాంటి సందర్భాలను చాలాసార్లు ఎదుర్కొన్నారని చెప్పాడు. కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్ అనీ, మెగా టోర్నీ కండీషన్స్ లో అతడు పరుగులు చేస్తాడనీ ధీమా వ్యక్తం చేశాడు. ఇక రోహిత్ కూడా వైట్ బాట్ క్రికెట్ లో అద్భుతంగా ఆడతాడని, ఛాంపియన్స్ ట్రోఫీలో పూర్తి భిన్నమైన రోహిత్ ను చూస్తారని చెప్పాడు.

ఇదిలా ఉంటే భారత బౌలింగ్ ఎటాక్ గురించి కూడా దాదా మాట్లాడాడు. ముఖ్యంగా బుమ్రా ఆడతాడా లేదా అన్న డౌట్స్ ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నాడు. మన బౌలింగ్ లో అతను ఎంత కీలక ఆటగాడో అందరికీ తెలుసన్నాడు. నాకౌట్ మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నట్టు దాదా చెప్పాడు. మరోవైపు ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్స్ కు చేరే జట్లపై దాదా తన అంచనాలను వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ , సౌతాఫ్రికా జట్లు బలంగా ఉన్నాయన్నాడు. హోం కండీషన్స్ లో ఆడుతున్న పాకిస్థాన్ ను తక్కువ అంచనా వేయలేమని దాదా చెప్పుకొచ్చాడు.