DAVID MILLER: మూడు మ్యాచ్‌లకు 1.25 కోట్లు.. పెళ్లి వాయిదా వేసుకున్న ఆటగాడు..

డేవిడ్ మిల్లర్ ఇటీవలే తన గర్ల్‌ ఫ్రెండ్‌ కామిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 07:19 PMLast Updated on: Mar 13, 2024 | 7:19 PM

David Miller Postponed Wedding To Play Bangladesh Premier League Miller Offered 150000 Dollars

DAVID MILLER: దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ మిల్లర్ ఇటీవలే తన గర్ల్‌ ఫ్రెండ్‌ కామిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. పెళ్లి వాయిదా వేసుకోవడంతో అతనికి భారీ మొత్తమే ముట్టింది. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్‌ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ ఇచ్చింది.

DELHI CAPITALS: ఢిల్లీ క్యాపిటల్స్‌ బిగ్‌షాక్‌.. సీజన్‌ నుంచి 4 కోట్ల ప్లేయర్‌ ఔట్

దీంతో మిల్లర్‌ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఎలిమినేటర్, క్వాలిఫయర్‌ 2తో పాటు ఫైనల్ మ్యాచ్‌ కూడా ఆడాడు. బీపీఎల్‌ 2024 విజేతగా మిల్లర్ ఆడిన ఫార్చూన్ బరిషల్‌ జట్టే నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ వెల్లడించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో బిజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదని , అయితే స్నేహితుల ద్వారా ఈ సంచలన విషయం తనకు తెలిసిందని అక్రం చెప్పాడు. మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్‌ ఫ్రాంచైజీ ముందుకు వచ్చిందన్నాడు.

దీంతో తన పెళ్లిని మిల్లర్ వాయిదా వేసుకుని ఆడినట్టు వెల్లడించాడు. టోర్నీ ముగిసిన తర్వాత మిల్లర్‌ గాళ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల విరామం అనంతరం ఐపీఎల్‌ ఆడేందుకు రానున్నాడు. ఈ సఫారీ స్టార్ ప్లేయర్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు.