DAVID WARNER: టెస్టులకే కాదు వన్డేలకూ గుడ్‌బై.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం
మరో రెండు రోజుల్లో తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. వన్డేల నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు చెప్పాడు.
DAVID WARNER: డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్. క్రీజులో అడుగుపెట్టాడంటే బౌండరీలు, సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడే వార్నర్‌కు దేశాలకతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. మరో రెండు రోజుల్లో తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. వన్డేల నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు చెప్పాడు.
VIRAT KOHLI: కోహ్లీకి అరుదైన అవార్డ్.. మెస్సీని వెనక్కి నెట్టిన భారత స్టార్ క్రికెటర్
అయితే ఫామ్, ఫిట్‌నెస్ సహకరిస్తే 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని తెలిపాడు. భారత్‌లో ప్రపంచకప్‌ను సాధించడం గొప్ప విషయమన్నాడు వార్నర్. వన్డేలకు వీడ్కోలు పలకడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు ఆడేందుకు వీలు ఉంటుందని, అలాగే జట్టులో మరికొందరికి అవకాశం లభించినట్టవుతుందన్నాడు. వచ్చే రెండేళ్లలో ఫామ్‌తో పరుగులు సాధిస్తుంటే, జట్టుకు తాను అవసరమని భావిస్తే.. అందుబాటులో ఉంటానని వార్నర్ చెప్పుకొచ్చాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వరల్డ్‌కప్ గెలవడం అద్భుతమని చెప్పాడు. ప్రపంచకప్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయామని, జట్టులో ఒకరికొకరు అండగా నిలుస్తూ విజయాలు సాధించామన్నాడు.
మాక్స్‌వెల్ వీరోచిత పోరాటం, భారత్‌తో జరిగిన ఫైనల్, దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ గుర్తుండిపోతాయన్నాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. 161 వన్డేల్లో 45 సగటుతో 6932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్‌గానూ వార్నర్ నిలిచాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా పాక్‌తో జరిగే టెస్ట్.. వార్నర్ కెరీర్‌లో చివరి మ్యాచ్. వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ టీ ట్వంటీలతో పాటు దేశవాళీ లీగ్స్‌లో ఆడనున్నాడు.