David Warner: అన్ బ్లాక్ చేయండి ప్లీజ్.. డేవిడ్ వార్నర్ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్..

తన అకౌంట్‌ను సన్ రైజర్స్ బ్లాక్‌ చేసిన స్క్రీన్‌ షాట్లను వార్నర్‌ సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు. 2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన వార్నర్‌.. తర్వాతి ఏడాదిలోనే ఎస్ఆర్‌హెచ్ జట్టుకు టైటిల్‌ అందించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 12:52 PMLast Updated on: Dec 20, 2023 | 12:52 PM

David Warner Blocked By Sunrisers Hyderabad On Instagram Fans Request Team About

David Warner: ఐపీఎల్‌ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను విజేతగా నిలబెట్టాడు డేవిడ్‌ వార్నర్‌. ఎస్ఆర్‌హెచ్ జట్టు తరఫున విజయవంతమైన కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. అలాంటి సారథిని వదులుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. అతడిని సామాజిక మాధ్యమాల్లోనూ బ్లాక్‌ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే వెల్లడించాడు. తాజాగా వేలంలో ఆస్ట్రేలియా సహచరుడు ట్రావిస్‌ హెడ్‌ను సన్‌రైజర్స్‌ రూ.6.80 కోట్లకు దక్కించుకున్న నేపథ్యంలో అతడికి సన్‌రైజర్స్‌ అకౌంట్లో అభినందనలు చెప్పాలని ప్రయత్నించి వార్నర్‌ విఫలమయ్యాడు.

Sunrisers Hyderabad: ఆకాశమే హద్దుగా ఆరేంజ్ ఆర్మీ.. టాప్ ప్లేయర్లతో బలంగా మారిన జట్టు

దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వేదికల్లో వార్నర్‌ను సన్‌రైజర్స్‌ బ్లాక్‌ చేయడమే. తన అకౌంట్‌ను సన్ రైజర్స్ బ్లాక్‌ చేసిన స్క్రీన్‌ షాట్లను వార్నర్‌ సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు. 2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన వార్నర్‌.. తర్వాతి ఏడాదిలోనే ఎస్ఆర్‌హెచ్ జట్టుకు టైటిల్‌ అందించాడు. బ్యాటర్‌గా 848 పరుగులు చేసి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 2021లో సీజన్‌ మధ్యలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్‌.. 2022 వేలంలో వదిలిపెట్టింది.

అతడిని దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. దూకుడైన ఆటతీరుకు వార్నర్ ఎన్‌సైక్లోపీడియా లాంటివాడు. సాధారణ ఆటగాళ్లతో సన్ రైజర్స్ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో వార్నర్ వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకెళ్లాడు. అలాంటి ఆటగాడిని సన్ రైజర్స్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం అన్యాయం అంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.