DAVID WARNER: హాఫ్ సెంచరీతో కెరీర్‌కు గుడ్ బై.. చివరి మ్యాచ్ ఆడేసిన వార్నర్..
వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం వార్నర్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.
DAVID WARNER: ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం వార్నర్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.
Anganwadis: అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం.. అయినా తగ్గేది లేదంటున్న కార్యకర్తలు
కాగా మూడో టెస్టులో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ విజయంతో వార్నర్‌కు ఆసీస్ ఘనమైన వీడ్కోలు పలికింది. 2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు ఎన్నో అద్భుతమైన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫార్మాట్ ఏదైనా వార్నర్ క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు హడలే. ఎందుకంటే దూకుడుగా ఆడే వార్నర్ బ్యాటింగ్‌కు పట్టపగలే ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనిపించేవి. తన టెస్టు కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. దీనిలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. అటువంటి విధ్వంసకర ఆటగాడు తప్పుకోవడం నిజంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు తీరని లోటు అనే చెప్పాలి.
అయితే వార్నర్ అద్భుత కెరీర్‌లో బాల్ టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ ఇకపై టీ20ల్లో మాత్రమే ఆడనున్నాడు.