డివీలియర్స్ రీఎంట్రీ ? హింట్ ఇచ్చిన మిస్టర్ 360
మిస్టర్ 360... ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒకే ఒక్క క్రికెటర్ ఏబీ డివీలియర్స్... క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు వణుకే... బౌలింగ్ చేయాలంటే టాప్ బౌలర్స్ కు సైతం టెన్షన్ గానే ఉంటుంది..
మిస్టర్ 360… ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒకే ఒక్క క్రికెటర్ ఏబీ డివీలియర్స్… క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లకు వణుకే… బౌలింగ్ చేయాలంటే టాప్ బౌలర్స్ కు సైతం టెన్షన్ గానే ఉంటుంది.. ఎందుకంటే స్టేడియం అన్నివైపులా షాట్లు కొట్టే ఏకైక ప్లేయర్ గా డివిలియర్స్ కు ఎంతో పేరుంది..తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఎన్నోసార్లు అభిమానులను అలరించడమే కాదు తన జట్టుకు విజయాలందించాడు. ఐపీఎల్ లోనూ దుమ్మురేపిన ఏబీడీ అంటే భారత అభిమానులకు కూడా ఇష్టమే.. అలాంటి ఏబీడీ 34 ఏళ్ళకే క్రికెట్ గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేసింది. డివిలియర్స్ మే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆ తర్వాత రెండేళ్లు తన క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ తరపున ఆడిన ఏబీ..బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు. 2021 క్రికెట్ లో అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
కుటుంబంతో గడిపేందుకు సమయం కోసమే ఆటకు దూరమైనట్లు వెల్లడించాడు. తర్వాత కంటి సమస్యతో సర్జరీ చేయించుకోవడం…. ఆటకి దూరంగా ఉండమని డాక్టర్లు సూచించడంతోనే రిటైర్మెంట్ ఇచ్చానని అసలు సంగతి కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే డివీలియర్స్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్యూలో అతను మాట్లాడిన మాటలే ఈ వార్తలకు కారణమయ్యాయి. తాను ఇంకా క్రికెట్ ఆడవచ్చేమో అనే అనుభూతి తనకు కలుగుతున్నట్లు ఏబీడీ వ్యాఖ్యానించాడు. తన కళ్ళు ఇంకా పనిచేస్తున్నాయనీ, గ్రౌండ్ కి వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఏబీడీ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
డివిలీయర్స్ తన అంతర్జాతీయ క్రికెట్ లో 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయగా… ఆర్సీబీలో కోహ్లీతో కలిసి ఆడాడు. ఇప్పటికీ ఈ సఫారీ హిట్టర్ కు ఐపీఎల్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.