Deepak Chahar: దీపక్ చాహర్ దిగుతున్నాడు.. రెండు టీ20లకు జట్టు ఇదే..!
జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా.. దీపక్ చాహర్‌ను అదనంగా స్క్వాడ్‌లోకి చేర్చారు. 2022 డిసెంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. నవంబర్ 28 గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కి ముందు దీపక్ చాహర్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు.

Deepak Chahar: భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం 5 టీ20ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికి 3 టీ20లు జరిగితే మొదటి రెండు మ్యాచ్‌లను భారత్ గెలవగా.. నిన్న గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. ఇక ఈ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు ఆసీస్ మంగళవారంనాటి జట్టును ప్రకటించగా.. తాజాగా భారత్ జట్టును ప్రకటించేశారు. జట్టులో ఎవరి మీద వేటు పడకపోగా.. దీపక్ చాహర్‌ను అదనంగా స్క్వాడ్‌లోకి చేర్చారు. 2022 డిసెంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ASSEMBLY ELECTIONS: బీఆర్ఎస్‌కు ఆ రెండు గుర్తుల టెన్షన్.. సిద్ధిపేట, గజ్వేల్‌లోనే టార్గెట్..
నవంబర్ 28 గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కి ముందు దీపక్ చాహర్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న చాహర్ సత్తా చాటి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇక చివరి రెండు టీ 20లకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఉంటాడని బీసీసీఐ సిరీస్‌కు ముందే తెలిపింది. వైస్ కెప్టెన్‌గా అయ్యర్ టీమిండియా బాధ్యతలను చేపడతాడు. మూడో టీ20కి ముందు పేసర్ ముఖేష్ కుమార్.. పెళ్లి కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. అయితే డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో జరగనున్న నాలుగో టీ20కి ముందు ఈ బెంగాల్ పేసర్ జట్టులో చేరనున్నాడు.
ముఖేశ్ కుమార్ స్థానంలో ఆవేశ ఖాన్ నిన్న జరిగిన మూడో టీ20లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్2-1 ఆధిక్యంలో ఉంది డిసెంబర్ 1న నాలుగో టీ20, డిసెంబర్ 3న 5 వ టీ20 జరుగుతాయి.