పారాలింపిక్స్ లో దీప్తి అదుర్స్ తెలంగాణ అమ్మాయికి కాంస్యం

పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో దీప్తి మూడో స్థానంలో నిలిచింది. రేసును 55.82 సెకన్లలో పూర్తిచేసి కాంస్యంతో సత్తా చాటింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 02:01 PMLast Updated on: Sep 04, 2024 | 2:01 PM

Deepti Adurs Bronze For Telangana Girl In Paralympics

పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో దీప్తి మూడో స్థానంలో నిలిచింది. రేసును 55.82 సెకన్లలో పూర్తిచేసి కాంస్యంతో సత్తా చాటింది. హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దీప్తి.. తుది పోరులో తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నా పోడియంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాలను నిలబెట్టుకుంది. వరంగల్ కు చెందిన దీప్తి జివాంజీ గత కొద్దికాలంగా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రికార్డు స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే ఈ ఏడాది జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 55.07 టైమింగ్‌తో కొత్త రికార్డు నెలకొల్పింది.