MS Dhoni: ధోనీపై పరువు నష్టం కేసు.. రేపే విచారణ
తమపై అసత్య ఆరోపణలు చేసిన ధోనీ.. తమ పరువుకు భంగం కలిగించాడని మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ధోనీతో పాటు తమకు వ్యతిరేకంగా పోస్ట్‌లను అనుమతించిన సోషల్ మీడియా వేదికలపైనా పరువు నష్టం దావా వేసారు.
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు అయ్యింది. ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్స్ మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ధోనీ.. తమ పరువుకు భంగం కలిగించాడని మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ధోనీతో పాటు తమకు వ్యతిరేకంగా పోస్ట్‌లను అనుమతించిన సోషల్ మీడియా వేదికలపైనా పరువు నష్టం దావా వేసారు.
Rameshbabu Praggnanandhaa: భళా ప్రజ్ఞా.. ఆనంద్‌ను దాటేసిన ప్రజ్ఞానంద
మిహిర్ దివాకర్, సౌమ్యా, ధోనీలు భాగస్వామ్యులుగా ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెట్ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. 2017లో సదరు సంస్థ ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం అర్కా స్పోర్ట్స్.. ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో సదరు కంపెనీ విఫలమైంది. ఈ విషయంపై తన భాగస్వాములతో ధోనీ చర్చించినా ఫలితం లేకపోయింది. దాంతో అతను ఈ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.
రాంచీ కోర్టులో దివాకర్, సౌమ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. ఒప్పందం రద్దు చేసుకున్నా.. దేశవ్యాప్తంగా తన పేరిట క్రికెట్ అకాడమీలను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని దివాకర్, సౌమ్యలు పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో తమ పరువుకు భంగం కలిగిందని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.