Nitesh Rana: మరోజట్టుకు కెప్టెన్ గా నితీష్ రానా
జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు.
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా పర్వాలేదనపించాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన అద్బుత ప్రదర్శరనతో కేకేఆర్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా అతడికి గతంలో దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుగా కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ అప్పగించింది.
ఇక రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. దేవధర్ ట్రోఫీకు ఎంపిక చేసిన నార్త్ జోన్ జట్టులో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఉన్నారు.